ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చగొట్టే నినాదాలకు నిర్వాహకులదే బాధ్యత

ABN, First Publish Date - 2022-05-28T08:47:44+05:30

తిరువనంతపురం, మే27: రాజకీయ సభల్లో ఎవరైనా రెచ్చగొట్టే నినాదాలు చేస్తే అందుకు ఆ కార్యక్రమ నిర్వాహకులే బాధ్యత వహించాలని శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేరళ హైకోర్టు తీర్పు

తిరువనంతపురం, మే27: రాజకీయ సభల్లో ఎవరైనా రెచ్చగొట్టే నినాదాలు చేస్తే అందుకు ఆ కార్యక్రమ నిర్వాహకులే బాధ్యత వహించాలని శుక్రవారం కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. సభలో పాల్గొన్నవారిని నియంత్రించాల్సిన విధి ని ర్వాహకులపై ఉందని జస్టిస్‌ పి.వి.కున్హికృష్ణన్‌ తెలిపారు. గత వారం అలప్పుళలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ర్యాలీలో ఒకరి భుజాలపై కూర్చొన్న బాలుడు వివాదాస్పద నినాదాలు ఇచ్చిన వీడియో వైరల్‌ అయింది. ఈ విషయమై దాఖలైన కేసుపై తీర్పు చెబుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఇలాంటి నినాదాలు ఇచ్చినవారు, నిర్వాహకుల మధ్య ఏదైనా అవగాహన ఉందని పోలీసులకు అనిపిస్తే దానిపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉం టుందని తెలిపారు. ఒకవేళ నిర్వాహకులకు వారితో ఎలాంటి సంబంధం లేనప్పటికీ, ఆనినాదాలకు మాత్రం వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఇటీవల మరో కేసు లో జస్టిస్‌ గోపీనాథ్‌ తీర్పు చెబుతూ చిన్నపిల్లలను రాజకీయ సభలకు తీసుకువచ్చి వారిచేత రెచ్చగొట్టే నినాదాలు ఇప్పిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-28T08:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising