ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP నుంచి పురుడు పోసుకోనున్న KCR కొత్త పార్టీ..!

ABN, First Publish Date - 2022-06-14T17:29:59+05:30

కేసీఆర్ (KCR) నేషనల్ పాలిటిక్స్ వైపు స్పీడ్ పెంచారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: కేసీఆర్ (KCR) నేషనల్ పాలిటిక్స్ వైపు స్పీడ్ పెంచారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ బాస్ టీం రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న విపక్షాలతోపాటు అధికారంలో ఉన్న 8 రాష్ట్రాల సీఎంలను కలుపుకుని పోయేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలువురు సినీ ప్రముఖులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ (New Party) ఏపీ నుంచి పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ కేవలం అధికార మార్పు కోసం కాకుండా కొత్త లక్ష్యాలతో ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. ఆ దిశగా పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ (పీకే)తో వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లితో భేటీ అయ్యారు.


దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తాను పెట్టే కొత్త పార్టీకి  ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంతో ఉండవల్లి నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఏపీలో వైసీపీతోపాటు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలను ఆకర్షించే అశంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతోపాటు కొత్తగా భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఎంటర్ కానుండడంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ఎంటర్ కావడంవల్ల ఎదురయ్యే పరిణామాలపై లెక్కలు వేసుకుంటున్నారు.

Updated Date - 2022-06-14T17:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising