ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: కేంద్ర పథకాల గురించి కేసీఆర్ ప్రచారం చేయించలేదు.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2022-10-17T23:34:37+05:30

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీ గురించి ప్రజానీకానికి తెలియకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. భూసార పరీక్షలకు నిధులు మంజూరు చేసినా .. కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గుచేటని పేర్కొన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీ గురించి ప్రజానీకానికి తెలియకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. భూసార పరీక్షలకు నిధులు మంజూరు చేసినా .. కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకంలో 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ. 3 వేలు పింఛన్ ఇచ్చే గొప్ప పథకానికి కేంద్రం మూడేళ్ల క్రితమే అంకురార్పణ చేసినా.. కేసీఆర్ సర్కారు దీనిపై రైతులకు అవగాహన కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఏటా వేలాది రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నా.. ఇది రైతులకు తెలిసిపోతే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో కేసీఆర్ రైతుల నోట్లో మట్టి కొట్టడం సిగ్గు చేటని మండిపడ్డారు. “ పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్” లో భాగంగా  ప్రధాని మోదీ 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK) ప్రారంభించడం హర్షణీమని..  అందులో భాగంగా తెలంగాలోని ప్రతి జిల్లాకు ఒక కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణ సహా దేశంలోని 3.3 లక్షల ఎరువుల రిటైల్ దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చే ప్రణాళికకు అంకురార్పణ జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ‘‘ఒకే దేశం - ఒకే ఎరువుల విధానంలో భాగంగా ‘‘భారత్’’ పేరుతో యూరియా బ్యాగ్‌లను ప్రధాని మోదీగారు ప్రారంభించడం సంతోషదాయకమని తెలిపారు.  

Updated Date - 2022-10-17T23:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising