ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకం: కవిత

ABN, First Publish Date - 2022-03-20T15:40:21+05:30

మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బందూకు చేతబట్టిన ధీశాలి మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం మాలాంటి ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అని, తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించారని కొనియాడారు. మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబానికి కవిత తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 


అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు.  శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

Updated Date - 2022-03-20T15:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising