ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కష్యప్ అరెస్ట్ - చంచల్‌గూడ జైలుకు తరలింపు

ABN, First Publish Date - 2022-08-30T22:22:34+05:30

Hyderabad: సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో కష్యప్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల హైదరాబాద్ సీపీ కార్యాలయం ముందు కష్యఫ్ ధర్నా చేశారు. ఇందులో ముస్లిం యువకులు కూడా పాల్గొన్నారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌నుద్దేశించి కష్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో కష్యప్‌ (Kashyap)ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల హైదరాబాద్ సీపీ కార్యాలయం ముందు కష్యఫ్ ధర్నా చేశారు. ఇందులో ముస్లిం యువకులు కూడా పాల్గొన్నారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Goshamahal MLA Raja Singh) నుద్దేశించి కష్యప్ చేసిన "సర్ తాన్ సే జూడ" వాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కష్యఫ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన యువకులు మొగల్పుర, భవానినగర్, హుస్సేనీఆలం, షహనద్గoజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో  పోలీసులపై రాళ్లు రువ్వి, పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. ఒక క్యాబ్ డ్రైవర్‌తో పాటు హోటల్ సిబ్బంది‌పై దాడికి పాల్పడ్డారు. ఆందోళనలకు భయపడి పలుచోట్ల దుకాణాలను మూసివేశారు. పదేపదే సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేస్తున్న కష్యప్‌పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అనంతరం కష్యప్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

Updated Date - 2022-08-30T22:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising