కరుణశ్రీ రచనల్లో భావపద సౌందర్యం
ABN, First Publish Date - 2022-08-04T05:30:00+05:30
జంధ్యాల పాపయ్యశాస్త్రి రచనలు భావపద సౌందర్యంతో నిండి ఉంటాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ పేర్కొన్నారు.
పాపాయ్యశాస్త్రి జయంత్యుత్సవ సభలో
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్
చిక్కడపల్లి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జంధ్యాల పాపయ్యశాస్త్రి రచనలు భావపద సౌందర్యంతో నిండి ఉంటాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ పేర్కొన్నారు. కరుణశ్రీగా ప్రసిద్ధిపొందిన పాపయ్యశాస్త్రి జయంత్యుత్సవాలను గురువారం త్యాగరాయగానసభలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కరుణశ్రీ కావ్య రచనతో పాపయ్యశాస్త్రి కరుణశ్రీగా పేరుగాంచారన్నారు. కుంతీకుమారి, పుష్పవిలాపం వంటి రచనలు తెలుగు భాష సంపదలన్నారు. వాటిని అమరగాయకుడు ఘంటసాల పాడి ప్రతి ఒక్కర్నీ రంజంపజేశారన్నారు. జనార్దనమూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉండగా ఆయనను సత్కరించారన్నారు. రామారావు చదువుకునే రోజుల్లో ఆయనకు కరుణశ్రీ గురువని పేర్కొన్నారు. కార్యక్రమంలో కవి రఘుశ్రీ, గాయనీగాయకులు త్రినాథరావు, శ్రీమణి, గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST