119 సీట్లూ గెలుస్తామంటే బాగుండేది: పొన్నాల
ABN, First Publish Date - 2022-12-31T03:51:48+05:30
రాష్ట్రంలో బీజేపీ 90 సీట్లు గెలుస్తుందని చెప్పడం కంటే.. 119 సీట్లూ గెలుస్తామని చెప్పుకుంటే బాగుంటుందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ 90 సీట్లు గెలుస్తుందని చెప్పడం కంటే.. 119 సీట్లూ గెలుస్తామని చెప్పుకుంటే బాగుంటుందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలమెంతో ప్రజలకు తెలుసన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో దేశాన్ని దోచుకోవడానికే బీఆర్‌ఎస్ పార్టీ అంటూ కేసీఆర్ బయలు దేరారన్నారు. కేసీఆర్ చెబుతున్న ఐటీ హబ్‌లు అన్నీ రియల్ వ్యాపారం కోసమేనన్నారు.
Updated Date - 2022-12-31T03:51:49+05:30 IST