ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టారాజ్యం..!

ABN, First Publish Date - 2022-06-27T17:27:51+05:30

మండలాల పరిధిలో అడ్జ్‌స్టమెంట్‌ పేరుతో అక్రమ బదిలీలు చోటుచేసుకుంటున్నా.. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలల్లో డిప్యూటేషన్ల పర్వం

ఎక్కువమంది విద్యార్థులున్న  చోట తక్కువ టీచర్లు.. 

తక్కువ పిల్లలున్న స్కూల్‌లలో  ఎక్కువ మంది డ్యూటీ

డిప్యూటేషన్ల కోసం ఒత్తిడి తీసుకొస్తున్న  పలు సంఘాలు   

పట్టించుకోని అధికారులు.. ఉన్న వారిపై అదనపు భారం


హైదరాబాద్‌ సిటీ: మండలాల పరిధిలో అడ్జ్‌స్టమెంట్‌ పేరుతో అక్రమ బదిలీలు చోటుచేసుకుంటున్నా.. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా, సింగిల్‌, జీరో టీచర్‌  ఉన్న స్కూళ్లకు కొంతకాలంగా  డిప్యూటేషన్లపై టీచర్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. మండలాల పరిధిలో అంతర్గతంగా ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా చెలామణి అవుతోన్న కొందరు తమకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్తున్నట్లు తెలిసింది. గతంలో బండ్లగూడ మండలంలోని జీపీఎస్‌ కేశవగిరి పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇందులో ఒకరిని చంద్రికాపూర్‌ జీపీఎ్‌సకు, మరొకరిని ఇందిరానగర్‌కు పంపించారు. అయితే, పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు పాత స్కూల్‌లో రిపోర్టు చేశారు. కాగా, ఒక టీచర్‌ మాత్రం తనకు గతంలో డిప్యూటేషన్‌పై వెళ్లిన చంద్రికాపూర్‌ జీపీఎ్‌సకే పంపించాలని మండల అధికారులపై ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఇతర సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిపివేశారు. అయితే తనది ప్రధాన సంఘమని.. మేము చెబితే వినాలని డిమాండ్‌ చేసి మళ్లీ ఆయన చంద్రికాపూర్‌ జీపీఎ్‌సకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ 1 నుంచి 5 వరకు తరగతులుండగా.. ఇప్పటికే ఇద్దరు టీచర్లు ఉన్నారు. 


కొందరిపై అదనపు భారం..

తక్కువ మంది విద్యార్థులున్న చోటకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై పంపిస్తుండడంతో ఎక్కువ మంది పిల్లలున్న పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లపై అదనపు భారం పడుతోందని పలువురు వాపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను పరిఽశీలించిన తర్వాతనే డిప్యూటేషన్లు వేయాల్సిన అధికారులు సంఘ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్నారని పేర్కొంటున్నారు. పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లకు వెళ్లడం ద్వారా వారంలో మూడు రోజులే విధులకు హాజరుకావచ్చని, మధ్యాహ్నం వేళలో ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందనే భావనతో కొందరు టీచర్లు డిప్యూటేషన్లకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీలోని పలు పాఠశాలల్లో అధికారులను మేనేజ్‌ చేసుకుని నచ్చిన చోట పనిచేస్తున్నారని సమాచారం. అయితే అక్రమ డిప్యూటేషన్ల పర్వాన్ని జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2022-06-27T17:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising