ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ (Telangana)పై రాజకీయ తీర్మానం చేయనున్న BJP

ABN, First Publish Date - 2022-07-03T17:29:53+05:30

బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ (Telangana)పై రాజకీయ తీర్మానం చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ఆదివారం జరగనున్న బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ (Telangana)పై రాజకీయ తీర్మానం చేయనున్నారు. నయా నిజాం పాలనకు ముగింపు పలికేందుకు మద్దతివ్వాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) జాతీయ నాయకత్వాన్ని కోరారు. అమరుల ఆకాంక్షలు పట్టించుకోవడంలేదని కార్యవర్గ సభ్యులకు వివరించారు. మరోవైపు ప్రధాని మోదీ దృష్టికి హైదరాబాద్ ఫ్లెక్సీల రాజకీయం చేరింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్‌కు తప్పకుండా బుద్ది చెబుతామంటున్నారు. 


తెలంగాణలో పరిస్థితి, ఉద్యమ కార్యాచరణ, సంపర్క్ అభియాన్‌పై తీర్మానం చేయనున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం ముసాయిదా సిద్ధం చేసింది. ఇవాల్టి కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.  హెచ్ఐసీసీ (HICC) వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ (Modi) రాత్రి నోవాటెల్ (Novotel) హోటల్‌లో బస చేశారు. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.

Updated Date - 2022-07-03T17:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising