ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-26T21:30:56+05:30

Hyderabad: పాతబస్తీ (Old ciry), ఫలక్ నుమా చష్మ ప్రాంతంలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: పాతబస్తీ (Old ciry), ఫలక్ నుమా చష్మ ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ అర్ధరాత్రి జమాల్ (Jamal) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ, ఫలక్ నుమా చష్మ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..


ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ యువకుడు జమాల్ డీజిల్ క్యాన్‌తో అర్ధరాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లాడు. యువతిని మాట్లాడనికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఫలితం లేకపోవడంతో జమాల్ డీజిల్‌ను వంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రాంతంలోని చష్మ ప్రాంతంలో మోసిన్ అనే టైలర్ దగ్గర జమాల్ పని చేస్తున్నాడు. కూరగాయలు, నిత్యవసర వస్తువులు తన ఇంట్లో ఇచ్చేసి రావాలని పదేపదే జమాల్‌ని మోసిన్ పంపేవాడు... ఇలా జమాల్ పదేపదే ఇంటికి రావడంతో మోసిన్ కుటుంబం జమాల్‌కు దగ్గర అయింది ఈ నేపథ్యంలోనే మోసిన్ కుమార్తెతో జమాల్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో జమాల్‌ను మందలించారు... ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి మోసిన్ ఇంటికి వెళ్ళిన జమాల్ అక్కడ ప్రియురాలు కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత జమాల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫాలక్ నుమా పోలీసులు జమాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Updated Date - 2022-06-26T21:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising