ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana High Court నూతన చీప్ జస్టిస్‌గా Ujjal Bhuyan ఈనెల 28న ప్రమాణం

ABN, First Publish Date - 2022-06-26T17:27:08+05:30

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఈ నెల 28న ప్రమాణం చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: తెలంగాణ (Telangana) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ (Ujjal Bhuyan) నియమితులయ్యారు. ఈ నెల 28న కొత్త సిజేగా ఆయన పరమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై (Tamili sai) రాజ్‌భవన్‌లో ఉజ్జల్‌ భుయాన్‌‌తో ప్రమాణ చేయించనున్నారు. ఈ నేపథ్యంలో నూతన సిజే ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్‌భవన్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు ఆహ్వానం పంపారు. సీఎం రిప్లైపై సీఎంవో మౌనంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరోసారి ముఖ్యమంత్రి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు గ్యాప్ మరింత పెరగనుంది.


రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. అలాగే ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు.

Updated Date - 2022-06-26T17:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising