ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: ‘ఎలాంటి Notices ఇవ్వకుండా సోదాలు చేసి, నా భార్యను అదుపులోకి తీసుకున్నారు’

ABN, First Publish Date - 2022-06-23T17:46:53+05:30

ఎన్ఐఏ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో సోదాలు చేశారని బండి కిరణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తమకు ఎలాంటి నోటీసులు (Notices) ఇవ్వకుండా ఇంటిపై సోదాలు చేశారని హైకోర్టు (High Court) అడ్వకేట్ శిల్ప (Silpa) భర్త బండి కిరణ్ (Bandy Kiran) అన్నారు. గురువారం ఆయన చిలకానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఉదయం ఎన్ఐఏ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసి, తన భార్య శిల్పాను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మావోయిస్టులో చేరిన రాధ ఎవరో తమకు తెలియదన్నారు. మేము ఆమెను మావోయిస్ట్ పార్టీలోకి పంపినట్లు కేసు నమోదు చేశారని, అయితే మాకు, రాధకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎంఎస్ (CMS) ఆర్గనైజేషన్‌లో ఎంతో మంది పని చేశారని, ఉద్దేశ పూర్వకంగా తమపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని బండి కిరణ్ పేర్కొన్నారు. 


కొద్ది రోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ కనిపించకపోవడంతో విశాఖలో మిస్సింగ్ కేసు నమోదైంది. రాధను నక్సల్స్‌లోకి చేర్చారని న్యాయవాది శిల్పపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం చిలకానగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. నాలుగు గంటలపాటు సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. అనంతరం లాయర్‌ శిల్పను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లారు.

Updated Date - 2022-06-23T17:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising