ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి: డా. రాజారావు

ABN, First Publish Date - 2022-03-23T16:34:27+05:30

సికింద్రాబాద్‎, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతదేహాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్‎, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతదేహాలు అన్ని పూర్తిగా కాలిపోయాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన మృత దేహాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఇలాంటి ఘటనలో పొగతోనే ముందుగా మరణిస్తారని, పొగ వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్తారన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్ట్ మార్టం నిర్వహిస్తామని డాక్టర్ రాజారావు తెలిపారు.


సికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

Updated Date - 2022-03-23T16:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising