ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రాజాసింగ్, రఘునందనరావు అరెస్టు

ABN, First Publish Date - 2022-03-07T20:14:30+05:30

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను పోలీసులు అరెస్టు చేశారు. సభలో సస్పెన్షన్‌కు నిరసనగా అసెంబ్లీ బయట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అయితే తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అరెస్టును బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ప్రభుత్వం బీజేపీపై కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తోందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని బీజేపీ భావిస్తోంది. 


గవర్నర్ ప్రసంగం లేకుండా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిరసనగా  బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం వారు అసెంబ్లీ బయట నల్ల కండువాలతో ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేసే అధికారం పోలీసులకు లేదని, అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ మాత్రమే తమను అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఆబిడ్స్ ఏసీపీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల హక్కులను హరించే అధికారం పోలీసులకు లేదని వారు అగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-03-07T20:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising