ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాంటెడ్ క్రిమినల్‌ను హైదరాబాద్‌కు తీసుకురానున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-01-24T15:47:40+05:30

వాంటెడ్ క్రిమినల్ చైన్‌ స్నాచర్ ఉమేష్‌ను సోమవారం పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వాంటెడ్ క్రిమినల్ చైన్‌ స్నాచర్ ఉమేష్‌ను సోమవారం పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం చైన్ స్నాచర్ అహ్మదాబాద్‌ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరుసగా ఉమేష్‌పై కేసులు ఉన్నాయి. నిందితుడు అహ్మదాబాద్ క్రైమ్‌ బ్రాంచ్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. సోమవారం ఉమేష్‌ను పిటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురాన్నారు. ఈ నెలలో 3 కమిషనరేట్ల పరిధిలో గంట వ్యవధిలో 6 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు 24గంటల్లో నిందితుడిని గుర్తించి.. పట్టుకున్నారు.


చైన్ స్నాచింగ్‌లకు తెగబడుతున్న నిందితుడి ఆట కట్టించారు పోలీసులు. గంట వ్యవధిలోనే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే రోజు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి నగర వాసులను హడలెత్తించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ పుటేజ్ ద్వారా చైన్ స్నాచర్‌ను గుర్తించిన పోలీసులు.. నిందితుడు గుజరాత్‌కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసుల సాయంతో నిందితుడి ఆచూకి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-24T15:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising