ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఆర్కే మఠ్‌లో జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు సత్కారం

ABN, First Publish Date - 2022-10-03T00:08:07+05:30

Hyderabad: దసరా శరన్నవరాత్రోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోన్న మఠం ఆధ్వర్యంలో ఆదివారం జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులను మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద నేతృత్వంలో స్వాములు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులను దుర్గామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: దసరా శరన్నవరాత్రోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోన్న మఠం ఆధ్వర్యంలో ఆదివారం జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులను మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద నేతృత్వంలో స్వాములు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులను దుర్గామాత స్వరూపాలుగా భావించి వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. మహిళా కార్మికులకు చీర, ప్రసాదం, శారదామాత జీవిత గాథ పుస్తకం కానుకలుగా అందించారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు హైదరాబాద్ నగరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచడం వల్లనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారని, వారి సేవలు అమూల్యమైనవని ఈ సందర్భంగా మాట్లాడిన స్వామి బోధమయానంద కొనియాడారు. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి భయానికి లోనుకాకుండా ప్రాణాలకు తెగ్గించి ఈ మహిళా కార్మికులు విధులు నిర్వహించడం నిజంగా అభినందనీయమని స్వామి బోధమయానంద వారిని ప్రశంసించారు. అనంతరం మహిళా కార్మికులకు మఠంలో దర్శనం చేయించారు. రామకృష్ణ మఠం తమ సేవలను గుర్తించి స్వాములు సత్కరించడంపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.





Updated Date - 2022-10-03T00:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising