ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News.. హైదరాబాద్: పాతబస్తీలొ ప్రశాంత వాతావరణం

ABN, First Publish Date - 2022-08-25T15:47:09+05:30

నిరసనల హోరుతో చెలరేగిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) వ్యాఖ్యలతో నిరసనల హోరుతో చెలరేగిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు తగ్గాయి. చార్మినార్ (Charminar) వద్ద షాపులు  తెరుచుకున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీ వ్యాప్తంగా  షాపులు తెరుచుకున్నాయి. అయితే గురువారం కూడా ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి ఆంక్షలు కొనసాగనున్నాయి.


వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ అరెస్టయి.. అంతలోనే బెయిల్‌పై బయటకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ అరెస్టుతో కాస్త శాంతించిన పరిస్థితి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు మంగళవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.  రాజాసింగ్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్‌ వ్యవహరిస్తున్నా.. పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-25T15:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising