ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain Effect: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

ABN, First Publish Date - 2022-07-22T16:07:43+05:30

వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరవ్యాప్తంగా వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వర్షం(Rain) కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరవ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారు ప్రయాణాన్ని గంట పాటు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టినా రోడ్లపై వాటర్ క్లియర్ చేసేందుకు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్ళమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. 


కాగా.... భాగ్యనగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడింది. హైదరాబాద్‎లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2022-07-22T16:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising