ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: జూబ్లీహిల్స్ మైనర్ కేసులో కీలక పరిణామం

ABN, First Publish Date - 2022-06-27T20:29:34+05:30

జూబ్లీహిల్స్ (Jubileehills) మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: జూబ్లీహిల్స్ (Jubileehills) మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు (Gang rape case)లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు నిందితుల డీఎన్ఏ (DNA) సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టు (Court)ను ఆశ్రయించారు. ఐదుగురు మైనర్లతోపాటు ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ (Saduddin Malik) డీఎన్ఏ సేకరణకు జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనుమతించింది. ఒకటి రెండు రోజుల్లో నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

 

ఇప్పటికే ఇన్నోవా కారులో సేకరించిన ఆధారాలన్నింటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు కూడా పోలీసుల చేతికి వచ్చింది. ఈ కేసులో ఇంకా బలమైన ఆధారాలు ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ టెస్టు చేసి.. ఆ రిపోర్టును కూడా చార్జ్ షీటులో పొందుపరిచేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. 

Updated Date - 2022-06-27T20:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising