ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News..హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

ABN, First Publish Date - 2022-08-07T17:00:45+05:30

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్స్ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్స్ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిని తండ్రి కర్కశంగా  కొట్టాడు. నిన్న సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కూతురు సకినా ఏడ్చింది. దీంతో సహనం కోల్పోయిన తండ్రి బాసిత్ అలీ ఖాన్ చిన్నారిని అతి దారుణంగా కొట్టాడు. పాపను నేల కేసి కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తల్లి చిన్నారిని సమీపంలో ఉన్న నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఉస్మానియ ఎమర్జెన్సీ వార్డులో  చికిత్స పొందుతోంది. పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న బాసిత్ అలీ ఖాన్‌కు నలుగురు సంతానం.. నలుగురు ఆడపిల్లలే.. 2015లో సన అనే మహిళను బాసిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. బార్య సన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, బాసిత్ అలీ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో భార్య, పిల్లలపైన దాడి చేసేవాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-07T17:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising