సుమోటోగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం
ABN, First Publish Date - 2022-08-04T05:54:29+05:30
ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 1న ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ‘ఆడపిల్లలు పుట్టారని ఇంటి నుంచి గెంటివేత’
మంగళ్‌హాట్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 1న ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ‘ఆడపిల్లలు పుట్టారని ఇంటి నుంచి గెంటివేత’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. సైదాబాద్ డివిజన్ లోకాయుక్తా కాలనీలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోరెంక శ్రీకాంత్(40), ఇంజనీరింగ్ చదివిన స్వప్న(35) భార్యాభర్తలు. కాగా, స్వప్నకు ఆడపిల్ల పుట్టడడంతో వేధింపులు మొదలయ్యాయి. ఈ నెల 1న స్వప్నను ఆమె పిల్లలను ఇంటి నుంచి గెంటి వేయడంతో ఆమె ఇంటి వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హెచ్‌ఆర్సీ స్పందించి ఈ నెల 24లోగా నివేదిక సమర్పించాలని మలక్‌పేట్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది.
కొనసాగుతున్న దీక్ష
సైదాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట స్వప్న బుధవారం దీక్ష కొనసాగించింది. విషయం తెలుసుకున్న సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అక్కడకు చేరుకుని బాధిత మహిళకు సంఘీభావం ప్రకటించారు. మహిళా సంఘాల నేతలను, బాధితురాలిని ఇంటి లోపలికి తీసుకెళ్లి భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చే యత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో స్వప్న తిరిగి ముగ్గురు చిన్నారులతో కలిసి దీక్ష కొనసాగిస్తోంది.
Updated Date - 2022-08-04T05:54:29+05:30 IST