ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న హిజ్రాలు

ABN, First Publish Date - 2022-12-26T10:44:06+05:30

హైదరాబాద్ (Hyderabad): నగరంలో హిజ్రాలు (Hijras) రెచ్చిపోతున్నారు. ప్రాంతాలుగా పంచుకుని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): నగరంలో హిజ్రాలు (Hijras) రెచ్చిపోతున్నారు. ప్రాంతాలుగా పంచుకుని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. నకిలీ (Fake), ఒరిజనల్ (Original) అంటూ గొడవలు పడుతున్నారు. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. హిజ్రాల గ్రూపు తగాదాల గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో రెండు వర్గాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వీరంగం సృష్టించారు. తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలీసాపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్‌లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాలు ఆందోళన చేపట్టారు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు. కొంతమంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో పోలీసులు హిజ్రాల మీద ఐపీసీ 353, 306 రెడ్ విత్ 511 కింద కేసు నమోదు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో కఠిన చర్యలకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-26T10:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising