ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులం.. రోగాల కలకలం

ABN, First Publish Date - 2022-12-15T03:22:13+05:30

రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సుస్తీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాసిరకం ఆహారంతో విద్యార్థులకు అనారోగ్యం

తాజాగా జూలూరుపాడులో 44 మందికి అస్వస్థత

హైదరాబాదు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సుస్తీ చేసింది. నాసిరకం భోజనంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. చలి వణికిస్తున్న తరుణంలోనూ చన్నీటి స్నానాలే చేయాల్సి వస్తోంది. నాణ్యత లేని భోజనం, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు జబ్బుల బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ సరిగా లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో 44 మంది అస్వస్థతకు గురికావడమే దీనికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 1,750 సంక్షేమ హాస్టళ్లుండగా ఇందులో 650 పోస్ట్‌ మెట్రిక్‌, 1,100 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2.50 లక్షల మంది విద్యనభ్యసిస్తుండగా, 1000కి పైగా ఉన్న గురుకులాల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హాస్టళ్లలోని విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరల్‌ ఫీవర్స్‌, వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీసీ హాస్టళ్ల పర్యటన సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ప్రకటించినా ఇంతవరకూ అతీగతీ లేదు. మరోవైపు శీతాకాలంలో వేడినీళ్లు అందించేందుకు సీజన్‌ ప్రారంభంలోనే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో అవి అమలుకావడం లేదు.

ఆహారం సరిగా లేక..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. సీజనల్‌ వ్యాఽధులతో విద్యార్థులు భయంభయంగా ఉంటున్నారు. నెలల తరబడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆహార నాణ్యతపై ప్రభావం పడుతోంది. ఫలితంగా సాయంత్రం స్నాక్స్‌, అరటిపండ్లు, గుడ్లు, చికెన్‌ అందించాల్సిన దానికంటే తక్కువగా అందిస్తున్నారు.

స్వయంపాకం..

హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలోని వంట, శానిటేషన్‌ వర్కర్లు సమ్మె బాట పట్టడంతో కొన్ని హాస్టళ్లు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులే స్వయంగా వంట చేసుకుంటున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది సమ్మెలో ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులే కలిసి భోజనం తయారు చేశారు.

Updated Date - 2022-12-15T03:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising