ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు: క్యాబినెట్ నిర్ణయం

ABN, First Publish Date - 2022-09-04T00:45:47+05:30

Hyderabad: ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ (CM KCR) సర్కారు ఘనంగా నిర్వహించనుంది. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించి, 16, 17, 18 తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ (CM KCR) సర్కారు ఘనంగా నిర్వహించనుంది. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని  కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించి, 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీయువకులు, మహిళల ర్యాలీలు, 17న తెలంగాణ వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణలు, అదే రోజు పబ్లిక్‌ గార్డెన్‌లో కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.  17న బంజారా, ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం అందులో భాగంగా నెక్లెస్‌రోడ్‌ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. 17న ఎన్టీఆర్‌ స్టేడియం దగ్గర కేసీఆర్ అధ్యక్షతన బహిరంగ సభ, 18న తెలంగాణ స్ఫూర్తి చాటేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు, కవులు, కళాకారులకు ప్రభుత్వం సత్కరించనున్నారు.  

Updated Date - 2022-09-04T00:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising