ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: మేనేజ్‌మెంట్‌ ఒక కళ

ABN, First Publish Date - 2022-10-02T17:34:49+05:30

పని, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా వాటిని మేనేజ్‌ చేయడం ఒక కళ అని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. తప్పులు లేకుండా చిన్న పనులను సక్రమంగా చేసుకుంటూ పోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌ సిటీ:  పని, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా వాటిని మేనేజ్‌ చేయడం ఒక కళ అని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. తప్పులు లేకుండా చిన్న పనులను సక్రమంగా చేసుకుంటూ పోవడం అలవాటు చేసుకుంటే ఎంత పెద్ద పనులనైనా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఖేమ్కా ఆడిటోరియంలో శనివారం పీజీపీమ్యాక్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ కష్టించి పనిచేయడంతోపాటు చేస్తున్న పనిలో స్పష్టత, సానుకూల దృక్పథం తప్పనిసరిగా ఉండాలన్నారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంలో విజయం సాధించకున్నా, దాని నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు.   వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా,  నైపుణ్యాలను మెరుగుపరుచుకోకపోతే సమాజంలో వెనకబడి పోతామన్నారు. కార్యక్రమంలో విద్యా, సాంకేతిక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌ కిషన్‌తోపాటు ఐఎ్‌సబీ అధ్యాపకులు, అలూమినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T17:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising