ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor Tamilisai: సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌ తమిళిసై చురకలు

ABN, First Publish Date - 2022-09-08T19:58:53+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు గవర్నర్‌ తమిళి సై (Governor Tamilisai) చురకలు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు గవర్నర్‌ తమిళి సై (Governor Tamilisai) చురకలు వేశారు. తెలంగాణ సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం అన్ని అవకాశాలను వదులుకుంటున్నారన్నారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్నారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.


గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై మీడియా సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ (Protocol) పాటించడం లేదన్నారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందని, ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందిపెట్టిందన్నారు. అయినా తాను భయపడలేదని చెప్పారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటన్నారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలీకాఫ్టర్ అడిగితే ఇవ్వలేదన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై తెలిపారు.

Updated Date - 2022-09-08T19:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising