ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: మరోసారి సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై ఫైర్

ABN, First Publish Date - 2022-07-25T18:40:10+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)పై గవర్నర్ తమిళిసై (Governor Tamili sai) మరోసారి ఫైర్ (Fire) అయ్యారు. ప్రోటోకాల్‌ (Protocol)ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రాష్ట్రపతి అయ్యారని, ఇది దేశం గర్వించదగిన అంశమని అన్నారు. తాను తెలంగాణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. ఈ దఫా పర్యటనలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్ (Pragati Bhavan), రాజ్‌భవన్ (Raj Bhavan) గ్యాప్‌పై తానిప్పుడేమీ వ్యాఖ్యానించనని అన్నారు. వరదలకు క్లౌడ్‌బస్టర్  కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు. వరదలవల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించానన్నారు. ఇటీవల ప్రధాని హైదరాబాదు పర్యటనలో రాజకీయాలపై చర్చించారా అన్న మీడియా ప్రశ్నకు తాను స్పందించనని గవర్నర్ తమిళి సై సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2022-07-25T18:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising