ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

ABN, First Publish Date - 2022-06-25T03:20:57+05:30

హైదరాబాద్: సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేష్ అన్న దామెర రామ్‍రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రామ్‌రాజు విద్యార్హతలకనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశాలు పంపారు. 


      ప్రధాని మోదీ సర్కార్ ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ప్రకటించిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లతో  పోలీసులు జరిపిన కాల్పులు జరిపారు. ఈ  రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు.  


అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ అంటే ఏమిటి?

అగ్నిపథ్ అనేది జూన్ 14, 2022న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిక్రూట్‌మెంట్ పథకం. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ "అగ్నివీర్స్" అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ అన్ని కేడర్‌లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు. ఈ పథకం కింద, 2022లో దాదాపు 46,000 మంది యువతను రిక్రూట్ చేస్తారు. ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ల సంఖ్య 5,000 పెరుగుతుంది. సైనికులకు నెలకు దాదాపు రూ.30,000-40,000 జీతం లభిస్తుంది.

Updated Date - 2022-06-25T03:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising