ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు ఎంపికల్లో మాకు న్యాయం చెయ్యండి

ABN, First Publish Date - 2022-12-10T03:20:28+05:30

పోలీసు ఎంపిక పరీక్షల్లో భాగమైన దేహదారుఢ్య పరీక్షలను తమకు ప్రత్యేకంగా నిర్వహించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ కేయూ మైదానం వద్ద ట్రాన్స్‌జెండర్ల నిరసన

దేహదారుఢ్య పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్‌

హనుమకొండ క్రైం, డిసెంబరు 9 : పోలీసు ఎంపిక పరీక్షల్లో భాగమైన దేహదారుఢ్య పరీక్షలను తమకు ప్రత్యేకంగా నిర్వహించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ, కేయూ మైదానం వద్ద పలువురు ట్రాన్స్‌జెండర్లు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ.. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల దరఖాస్తులో పురుషులు/స్త్రీలు అని మాత్రమే ఉందని ‘ఇతరులు’ అని లేదన్నారు. పదో తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం కొందరు ట్రాన్స్‌జెండర్లు పురుషులుగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఫిజికల్‌ టెస్టులకు వారిని పురుషులుగానే పరిగణిస్తున్నారని వాపోయారు. ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు పురుషులతో సమానంగా పరుగెత్తలేరని, మహిళలతో కలిసి ఎంపికల్లో పాల్గొనలేరని వివరించారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పందించి ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. కాగా, ఈ సమస్య తమ పరిధిలోనిది కాదని, విధాన నిర్ణయమని వరంగల్‌ సీపీ స్పష్టం చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీజీకి సమాచారం అందించామని చెప్పారు. శుక్రవారం దేహదారుఢ్య పరీక్షల్లో పురుషులతో కలిసి పరుగెత్తిన ఓ ట్రాన్స్‌జెండర్‌ అర్హత సాధించలేకపోయారని వివరించారు.

Updated Date - 2022-12-10T03:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising