ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కారం

ABN, First Publish Date - 2022-12-10T00:40:12+05:30

జానపద పాటలు అలవోకగా పాడగల ఎస్పీ శైలజ శాస్త్రీయ గీతాలను స్వరబంధురంగా ఆలపించే మధురగాన విదుషీమణి అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు ప్రశంసించారు.

ఎస్పీ శైలజకు పురస్కారం ప్రదానం చేస్తున్న జస్టిస్‌ రామలింగేశ్వరరావు, రుద్రరాజు పద్మరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): జానపద పాటలు అలవోకగా పాడగల ఎస్పీ శైలజ శాస్త్రీయ గీతాలను స్వరబంధురంగా ఆలపించే మధురగాన విదుషీమణి అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు ప్రశంసించారు. త్యాగరాయగానసభ ప్రధాన వేదికపై రాగరాగిణి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నేపఽథ్యగాయని ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టి్‌స రామలింగేశ్వరరావు పురస్కారం బహూకరించి మాట్లాడారు. ఘంటసాల తెలుగువారికి లభించిన గొప్ప వరమన్నారు. ఆయన పాడిన ప్రతి పాట ఆణిముత్యమని అన్నారు. అధ్యక్షత వహించిన శాసనమండలి మాజీ సభ్యులు రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ పాట ఉన్నంత కాలం ఘంటసాల జీవించి ఉంటారని అన్నారు. బోయి భీమన్న నిధి చైౖర్మన్‌ హైమవతి భీమన్న.... శైలజ, ఆమె భర్త సుధాకర్‌ను అభినందించారు. సుబ్బలక్ష్మి నివేదిక సమర్పించగా, ఆనంద్‌ వ్యాఖ్యానంలో రమణకుమారి బృందం మధురంగా పాటలను ఆలపించారు. నాట్యగురువు పద్మజారెడ్డి, సినీ జర్నలిస్ట్‌ సంజయ్‌, సౌజన్యదాతలు ఆంజనేయులు, రామమూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising