ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఫ్లెక్సీలు చించేయండి!

ABN, First Publish Date - 2022-07-22T17:10:59+05:30

టీఆర్‌ఎ్‌సలో విభేదాలు భగ్గుమన్నాయి. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ఆయన వ్యతిరేక వర్గం మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తన ఫొటో లేదని అనుచరులకు ఎమ్మెల్యే ఆదేశం

 అంబర్‌పేట టీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విభేదాలు 


హైదరాబాద్/రాంనగర్‌: టీఆర్‌ఎ్‌సలో విభేదాలు భగ్గుమన్నాయి. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ఆయన వ్యతిరేక వర్గం మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు వీధికెక్కాయి. ఫ్లెక్సీల చించివేతతో ముఠా తగాదాలు రచ్చకెక్కాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అనుచరుడైన సీనియర్‌ నాయకుడు తొలుపునూరి కృష్ణగౌడ్‌ అంబర్‌పేట మహంకాళి ఆలయ ప్రాంతంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, తలసాని తదితర ప్రముఖులతో కూడిన నాలుగు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ఫొటో లేకపోవడంతో అనుచరులు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే కారులోంచి ఫ్లెక్సీలను చూసి తన ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని ఆదేశించడంతో అనుచరులు వాటిని చించేశారు.


ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్లు కె.పద్మావతి డీపీరెడ్డి, పులి జగన్‌, గరిగంటి శ్రీదేవి, ఎక్కాల చైతన్య, సీనియర్‌ నాయకులు గరిగంటి రమేష్‌ ఎక్కాల కన్నా, బొమ్మన నాగే్‌షగౌడ్‌, జీవన్‌గౌడ్‌, గిరిధర్‌గౌడ్‌ తదితర నేతలకు కృష్ణగౌడ్‌ తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని వంటి ప్రముఖుల ఫ్లెక్సీలను చించివేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులు కేటీఆర్‌, తలసాని, పార్టీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంబర్‌పేట పీఎ్‌సలో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు కృష్ణగౌడ్‌, మాజీ కార్పొరేటర్లు తెలిపారు. విచారణ జరుపుతున్నామని డీఐ ప్రభాకర్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-22T17:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising