ఐఎంఐ తెలంగాణకు ఐదుగురు సలహాదారులు
ABN, First Publish Date - 2022-12-07T04:01:05+05:30
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఐ) తెలంగాణ రాష్ట్ర విభాగానికి సలహాదారులుగా ఐదుగురు ప్రముఖుల్ని నియమించినట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ): ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఐ) తెలంగాణ రాష్ట్ర విభాగానికి సలహాదారులుగా ఐదుగురు ప్రముఖుల్ని నియమించినట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో అపోలో గ్రూప్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతా్‌పరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డి, లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డాక్టర్ గీతారెడ్డి, సరోజిని కంటి ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాజలింగంలు ఉన్నారు.
Updated Date - 2022-12-07T04:01:06+05:30 IST