ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా బాక్సర్లను సత్కరించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి Anurag Thakur

ABN, First Publish Date - 2022-05-25T02:05:02+05:30

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో విజేతలుగా నిలిచిన మహిళా బ్యాక్సర్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ సత్కరించారు. ఢిల్లీలొని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో విజేతలుగా నిలిచిన మహిళా బ్యాక్సర్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ సత్కరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నిఖత్ జరీన్, ప్రవీణ్ హుడా, మనీషా మౌన్ సహా బాక్సింగ్ కోచ్‌లను ఆయన అభినందించారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 52 కేజీల విభాగంలో తెలంగాణ నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం, ప్రవీణ్ హుడా,మనీషా మౌన్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ..  ఇతర క్రీడాకారులకు మహిళా బాక్సర్లు స్ఫూర్తిగా నిలిచారని, కేంద్రం ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందన్నారు.  కాగా వరల్డ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉందని.. అయితే ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని ఉందని నిఖత్ జరీన్ పేర్కొంది.  తన నెక్స్ట్ టార్గెట్ కామన్వెల్త్ పోటీలన్నారు.  ముస్లిం మహిళగా క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించానని,  తన నాన్న ప్రోత్సహం, స్పాన్సర్ల మద్దతుతో ప్రతిభ చాటానన్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం తనకు 50 లక్షల ఆర్థిక సాయం చేసిందని, ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు కూడా ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నానని జరీన్ పేర్కొంది. 

Updated Date - 2022-05-25T02:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising