ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పల్‌లో హత్యకు గురైన తండ్రీకొడుకుల నేత్ర దానం

ABN, First Publish Date - 2022-10-17T17:43:42+05:30

ఉప్పల్‌లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన తండ్రీకొడుకుల నేత్రాలను వారి కుటుంబసభ్యులు దానం చేశారు. ఈ విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధలోనూ దాతృత్వం చాటుకున్న కుటుంబీకులు

హైదరాబాద్/ఉప్పల్‌: ఉప్పల్‌లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన తండ్రీకొడుకుల నేత్రాలను వారి కుటుంబసభ్యులు దానం చేశారు. ఈ విషయం బంధువుల ద్వారా ఆలస్యంగా తెలిసింది. ఈ నెల 14న ఉప్పల్‌, హనుమసాయినగర్‌లో నివసించే నర్సింహశర్మ, అతని కుమారుడు శ్రీనివాసశర్మను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వైద్యులు మృతుల బంధువులను సంప్రదించగా వారు నర్సింహశర్మ పెద్ద కొడుకు వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. తండ్రి, సోదరుడు చనిపోయారన్న బాధను దిగమింగుకున్న వెంకటేశ్వర్లు వారి కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు. ఆస్పతి వైద్యులు, ఉప్పల్‌ వాసులు వెంకటేశ్వర్లును అభినందించారు.

Updated Date - 2022-10-17T17:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising