పేలిన గ్యాస్ సిలిండర్
ABN, First Publish Date - 2022-11-10T00:47:12+05:30
సిలిండర్ పేలి ఇంటి పై కప్పు ధ్వంసమైన ఘటన పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
ఇంటిపై కప్పు ధ్వంసం, తప్పిన ప్రాణ నష్టం
పహాడిషరీఫ్ నవంబర్ 9(ఆంధ్రజ్యోతి): సిలిండర్ పేలి ఇంటి పై కప్పు ధ్వంసమైన ఘటన పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మంఖాల్‌కు చెందిన బరిగేలా మధుకర్ 45, బుధవారం ఉదయం 6గంటలకు గ్యాస్ స్టవ్ పై టీ పెట్టి ఇంటి బయట దుస్తులు ఉతుకుతున్నాడు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. మధుకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-02-17T09:26:08+05:30 IST