ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dammaiguda బాలిక విషాదాంతం వెనుక అసలేం జరిగింది?

ABN, First Publish Date - 2022-12-16T14:57:11+05:30

బాలిక తల, నడుముపై తీవ్రగాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. పాపను ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేకుంటే

అసలేం జరిగింది?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దమ్మాయిగూడ(Dammaiguda) బాలిక విషాదాంతం వెనుక అంతుచిక్కని అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్కూల్‌కి వచ్చాక మధ్యలో ఎందుకు వెళ్లింది? ఎవరైనా తీసుకెళ్లారా? లేదంటే ఆమెనే వెళ్లిందా? ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్నట్టుగా సీసీకెమెరాలో కనిపిస్తోంది. అసలు స్కూల్ నుంచి మధ్యలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.

పోలీసుల దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. బాలిక తల, నడుముపై తీవ్రగాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. పాపను ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేకుంటే ప్రమాదవశాత్తు పడిపోయిందా? అన్న కోణం(Missing girl case)లో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ABN చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ

దమ్మాయిగూడ బాలిక మృతి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అంశాలు ఏబీఎన్(ABN) చేతికి చిక్కాయి. అంబేడ్కర్‌నగర్‌లోని ఎన్‌టీఆర్‌నగర్‌ కాలనీకి చెందిన బాలిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. నిన్న(15-12-2022) ఉదయం 9:20 నిమిషాలకు చిన్నారి స్కూల్ నుంచి బయటకు వెళ్లింది. స్కూల్‌లో బుక్స్ పెట్టి ఆడుకోవడానికి పార్కుకు వెళ్తున్నానని స్నేహితులతో చెప్పి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉదయం 10:20 నిమిషాలైనా తిరిగి స్కూల్‌కు రాకపోవడంతో క్లాస్ టీచర్.. ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. అనంతరం స్కూల్ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఉదయం 11 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం ఉదయం చెరువులో శవమై కనిపించింది. తిరిగి క్షేమంగా వస్తుందని ఎదురుచూసిన తల్లిదండ్రులకు, బంధువులకు ఊహించని షాక్‌తో లబోదిబోమన్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టులో ఏముందో..

గాంధీ ఆస్పత్రిలో బాలికకు పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో మొత్తం 22 కాలమ్స్‌లో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. మరి కాసేపట్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాలిక ఒంటిపై ఉన్న గాయలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక బాధిత కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించారు.

Updated Date - 2022-12-16T15:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising