ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ISPPD: ఐఎస్‌పీపీడీ పగ్గాలు చేపట్టిన డా.రాధిక ముప్ప

ABN, First Publish Date - 2022-11-28T18:36:55+05:30

పీడియాట్రిక్ డెంటిస్టుల అఖిల భారత సంఘం ఇండియన్ సొసైటీ ఆఫ్ పిడొడాంటిక్స్ అండ్ ప్రెవెంటివ్ డెంటిస్ట్రీ అధ్యక్ష బాధ్యతలను ఓ తెలుగు మహిళ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీడియాట్రిక్ డెంటిస్టుల అఖిల భారత సంఘం ఇండియన్ సొసైటీ ఆఫ్ పిడొడాంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ(ఐఎస్‌పీపీడీ-ISPPD) అధ్యక్ష బాధ్యతలను ఓ తెలుగు మహిళ చేపట్టారు. నవంబర్ 24-26 వరకూ భోపాల్‌లో జరిగిన 43వ నేషనల్ కాన్ఫరెన్స్‌ PEDOTAAL-2022లో డా. రాధిక ముప్ప అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి దంతవైద్యురాలిగా డా. రాధిక అరుదైన గుర్తింపు సాధించారు. ఈ బాధ్యత తనకు లభించిన అరుదైన గౌరవమని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఐఎస్‌పీపీడీ వ్యవస్థాపకులు.. సంఘానికి పటిష్ఠ పునాదులు ఏర్పరిచారని ఆమె ప్రశంసించారు. తమ కృషితో ఐఎస్‌పీపీడీ అభివృద్ధికి బాటలు పరిచారన్నారు. దేశంలోని ప్రతి చిన్నారి మోముపై అందమైన చిరునవ్వు సృష్టించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. డా. రాధిక ముప్ప ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో అమూల్య డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. శ్రీ ధర్మస్థల మంజునాథ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(ధార్వాడ్)లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) చేసిన డా. రాధిక అటుపై.. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో ఎండీఎస్ పూర్తి చేశారు.

Updated Date - 2022-11-28T19:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising