దేవుళ్లపై డిస్కమ్‌ల దయ
ABN, First Publish Date - 2022-12-07T03:56:05+05:30
ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు అందించే విద్యుత్తుకు చార్జీలు తగ్గించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు యూనిట్ రూ.5కే విద్యుత్తు!
ప్రస్తుతం రూ.7 వసూలు.. తగ్గింపుపై ఈఆర్‌సీ నిర్ణయమే తుది
హైదరాబాద్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు అందించే విద్యుత్తుకు చార్జీలు తగ్గించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ప్రస్తుతం యూనిట్‌కు రూ.7 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.5కే ఇవ్వాలంటూ టారిఫ్ ప్రతిపాదనలను టీఎ్‌సఈఆర్‌సీలో ప్రతిపాదించాయి. ఫిక్స్‌డ్/డిమాండ్ చార్జీల స్వల్ప పెంపునూ అందులో పేర్కొన్నాయి. ఎల్టీ-5(బి) విభాగం కింద 2 కిలోవాట్ల లోపు లోడ్ కలిగిన ప్రార్థనా స్థలాలకు ప్రస్తుతం విధిస్తున్న స్థిర చార్జీల (ఫిక్స్‌డ్/డిమాండ్)ను రూ.21 నుంచి రూ.30కి పెంచాలని, ఈ కేటగిరీలోని కనెక్షన్లకు చార్జీలను యూనిట్‌కు రూ.6.40 నుంచి రూ.5కి తగ్గించాలని కోరాయి. ఇదే కేటగిరీలో 2 కిలోవాట్ మించి లోడ్ కలిగిన ప్రార్థనా స్థలాలకు స్థిర చార్జీలను రూ.21 నుంచి రూ.30కి పెంచాలని, ఎనర్జీ చార్జీలను యూనిట్ రూ.7 నుంచి రూ.5కి తగ్గించాలని ప్రతిపాదించాయి. ఈఆర్‌సీ ఆమోదం తెలిపితే 2023 ఏప్రిల్ నుంచి చార్జీల తగ్గింపు అమల్లోకి రానుంది.
Updated Date - 2022-12-07T03:56:07+05:30 IST