ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: రాత్రి పది తర్వాత శబ్ధం వినిపించకూడదని హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2022-12-31T09:13:28+05:30

కొత్త సంవత్సరం వేడుకల వేళ జూబ్లీహిల్స్‌లోని పబ్స్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. రాత్రి 10 గంటల తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి పది తర్వాత శబ్ధం వినిపించకూడదని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకల వేళ జూబ్లీహిల్స్‌లోని పబ్స్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ బంద్‌ చేయాలని ఆదేశించింది. ఫార్జీ కేఫ్‌, ఆమ్నేసియా లాంజ్‌, బ్రాడ్‌వే ది బ్రూవరీ పబ్స్‌ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. ఇంతకుముందు సన్‌బర్న్‌ సూపర్‌ క్లబ్‌ దాఖలు చేసిన ఇదే తరహా అప్లికేషన్‌ను కొట్టేశామని, దాన్నే ఇక్కడా వర్తింపజేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. జూబ్లీహిల్స్‌లో శబ్దకాలుష్య నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి దాటే వరకు పబ్స్‌లో డీజేలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ రెసిడెన్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలపై జూబ్లీహిల్స్‌ బయట ఉన్న కొన్ని పబ్స్‌ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేశాయి. ఈ అప్పీళ్లపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం.. రాత్రి 10 గంటల వరకు మాత్రమే మ్యూజిక్‌ పెట్టాలన్న ఆదేశాలను జూబ్లీహిల్స్‌ వరకే పరిమితం చేసింది.

Updated Date - 2022-12-31T09:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising