ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసా ఏజెంట్‌ అదృశ్యం

ABN, First Publish Date - 2022-11-30T00:45:37+05:30

ఓల్డ్‌ బోయినపల్లి యాదిరెడ్డి కాలనీలో నివాసం ఉండే వీసా ఏజెంట్‌ అదృశ్యమయ్యాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోయినపల్లి, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఓల్డ్‌ బోయినపల్లి యాదిరెడ్డి కాలనీలో నివాసం ఉండే వీసా ఏజెంట్‌ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండి రాజేష్‌(34) హ్యాపీ వీసా కంపెనీలో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఆరేళ్ల క్రితం తీక్షితతో వివాహం అయింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే రాజేష్‌ తాను పనిచేస్తున్న కంపెనీలో మజార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడిని నమ్మిన రాజేష్‌ కొన్ని లావాదేవీలు అతని ద్వారా చేశాడు. అయితే రాజే్‌షను నమ్మించిన సద రు వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వలేదని బుకాయించాడు. ఈ విషయం హ్యాపీ వీసా కంపెనీ యాజమాన్యంకు తెలవడంతో రాజే్‌షను డబ్బు కట్టాలని తెలిపారు. లేదంటే దొంగగా ముద్రవేయాల్సి వస్తుందని బెదిరించాడు. భయంతో ఉన్న రాజేష్‌ ఈ విషయాన్ని భార్య తీక్షితకు నాలుగురోజుల క్రితం ఫోన్‌ ద్వారా వివరించాడు. ఆనాటినుంచి రాజేష్‌ ఫోన్‌ పని చేయడం లేదు. కంపెనీ పని మీద బయటకు వెళ్లి ఉంటాడని, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తీక్షిత వేచి చేస్తోంది. నాలుగు రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో రాజేష్‌ పని చేస్తున్న కంపెనీకి ఫోన్‌చేసి ఆరా తీయగా అతను కొన్ని రోజులుగా కంపెనీకి రావడంలేదని వారు వివరించారు. దీంతో అనుమానం వచ్చిన తీక్షిత తన భర్త కనిపించడంలేదని బోయినపల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన భర్త కనిపించకుండా పోవడానికి అతడు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యంతో పాటు అందులో పని చేసే వారిపైనే అనుమానం ఉన్నట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2022-11-30T00:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising