ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Defamation suit: బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన కవిత

ABN, First Publish Date - 2022-08-23T18:13:50+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Liquor scam)లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ (BJP) నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) పరువు నష్టం దావా (Defamation suit) వేశారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా చేసిన ఆరోపణలపై కవిత సీరియస్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు, తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కవిత అన్నారు. అయితే సీఎం కేసీఆర్‌ (CM KCR)ను బీజేపీ టార్గెట్ చేసిందని, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఫోకస్ పెట్టిందని ఆమె అన్నారు. కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాడానికి.. ఆయన కుమార్తనైన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కవిత విమర్శించారు.


కాగా ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) మంగళవారం ఉదయం కలిశారు. నిన్న కవిత ఇంటిపై బీజేపీ (BJP) కార్యకర్తలు దాడికి దిగడంపై దాడిని ఖండిస్తూ కవితకు తలసాని సంఘీభావం తెలిపారు. మంత్రితోపాటు భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ  బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కవిత టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2022-08-23T18:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising