ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-10T00:30:21+05:30

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపాపేట, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్‌ నందనవనానికి చెందిన అనితకు దళితబంధు పథకం కింద మంజూరైన రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన నికిత బోటిక్‌, సారీస్‌ షాప్‌ను శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. దళితబం ధు పథకం అనేది ఎస్సీల సాధికారిత కోసం టీఎస్‌ ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. మంజూరైన డబ్బులతో పరిశ్రమలు, ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొని లబ్ధిపొందాలని కోరారు. దళితబంధుకు దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో యూనిట్‌లు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయ చైర్మన్‌ ఈశ్వరమ్మయాదవ్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఆందోజు సత్యంచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, డేరంగుల కృష్ణ, శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌నాయక్‌, శివారెడ్డి, సయ్యద్‌పాషా, గోకుల్‌ సరోజ, గోపిమధు, శైలజ, నాగలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising