ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త దారుల్లో Cyber Frauds.. ఇలా కూడా చేస్తున్నారా..!?

ABN, First Publish Date - 2022-02-17T14:59:47+05:30

కొత్త దారుల్లో Cyber Frauds.. ఇలా కూడా చేస్తున్నారా..!?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • క్రిప్టో, స్టాక్‌ మార్కెట్‌..
  • ట్రేడింగ్‌ పేరుతో టోకరా

హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌ : ‘టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌లా మీరు కూడా తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారే అవకాశం. క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడితో ఎక్కువ లాభా లు’ అంటూ సైబర్‌ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. లాటరీ, గిఫ్ట్‌ పేరుతో చేస్తున్న మోసాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో కొత్తదారులను ఎంచుకుంటున్నారు. 


రెండు కేసులు.. 30 లక్షలు.. 

అంబర్‌పేటకు చెందిన యువకుడికి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో బాగా లాభాలు సంపాదించానని చెప్పాడు. ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఉందని, తన వద్ద పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మించా డు. ఆ యువకుడు మిత్రులతో కలిసి పెట్టుబడి పెట్టేందుకు ఆ వ్యక్తిని సంప్రదించాడు. యువకుడి ఫోన్‌కు ఓ లింక్‌ పంపించాడు. దాన్ని క్లిక్‌ చేస్తే ట్రస్ట్‌ వాల్యూ యూకే డాట్‌ కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయింది. అందులో చెప్పిన విధంగా నలుగురు స్నేహితులు కలిసి విడతల వారీగా రూ.17 లక్షలకు పైగా డిపాజిట్‌ చేశారు. 


కోట్లాది రూపాయలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది కానీ విత్‌డ్రా ఆప్షన్‌ లేదు. దీంతో ఈ వ్యాపారాన్ని పరిచయం చేసిన వ్యక్తిని సంప్రదించగా.. లాభాలు డ్రా చేయాలంటే మరో రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశాడు. లాభాలు అడిగిన ప్రతిసారీ డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో అనుమానం వచ్చిన యువకులు గట్టిగా అడిగే సరికి నిందితుడు ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా నిలిపేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.


మరో కేసులో..

ఆన్‌లైన్‌లో పరిచయమైన సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మిన మల్లేపల్లికి చెందిన యువ తి ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని.. విడతల వారీగా రూ.13 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. లాభాలను ఖాతాలో జమ చేశామ ని సైబర్‌ నేరగాళ్లు నమ్మించేవారు. ఖాతాను పరిశీలించగా డబ్బు జమ కాలేదని గుర్తించి నిందితులను గట్టిగా డిమాండ్‌ చేయగా, ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

Updated Date - 2022-02-17T14:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising