ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే కారైతే వదిలేస్తారా ?

ABN, First Publish Date - 2022-06-19T17:15:43+05:30

పెండింగ్‌ చలాన్ల వసూలు అంశంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల రూటే సపరేటుగా ఉంది. సామాన్యులను ముక్కు పండి చలాన్లు వసూలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండింగ్‌ చలాన్ల వసూలులో ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై విమర్శలు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: పెండింగ్‌ చలాన్ల వసూలు అంశంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల రూటే సపరేటుగా ఉంది. సామాన్యులను ముక్కు పండి చలాన్లు వసూలు చేసే పోలీసులు.. ఓ ఎమ్మెల్యే విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. అద్దాలపై బ్లాక్‌ ఫిలిం, స్టిక్కర్ల అతికించి ఉన్న కార్లపై చర్యలు తీసుకునేందుకు అడిషనల్‌ డీసీపీ రంగారావు ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఫిలింనగర్‌ నుంచి బంజారాహిల్స్‌ వైపు వెళుతున్న ఓ కారును ఆపారు. ఆ కారుకు సంబంధించి ఎనిమిది చలానాలు బకాయి ఉండగా రూ.5000 చెల్లించాల్సి ఉంది. అయితే, వాహనం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ది అని, ఆయన కుటుంబసభ్యులు బయటికెళుతున్నారని కారులోని వ్యక్తులు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చలానాలు కట్టేయండి అంటూ డ్రైవర్‌కు నచ్చజెప్పి కారును సాగనంపారు. కానీ, పెండింగ్‌ చలానాలున్న ఇతర వాహనాలపై మాత్రం కేసులు పెట్టారు. దీంతో ప్రజాప్రతినిధులకు ఓ న్యాయం, సామాన్యునికి ఓ న్యాయమా అంటూ పలువురు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కాగా అదే దారిలో వెళుతున్న సినీ నటి మంచులక్ష్మీకి చెందిన కారును ఆపిన పోలీసులు  ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కారును సీజ్‌ చేయగా.. ఆమె జరిమానా చెల్లించినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-19T17:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising