ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వస్త్ర వ్యాపారిపై దాడి

ABN, First Publish Date - 2022-08-08T05:54:42+05:30

నీ వద్ద కొనుగోలు చేసిన దుస్తులు బాగాలేవు. చిరిగిపోయినవి అమ్మావు. మా డబ్బులు ఇవ్వాలని ద్విచక్రవాహనంపై తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్న వ్యక్తిపై నలుగురు దాడిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుస్తులు, ద్విచక్రవాహనం లాక్కొని పరారీ

పంజాగుట్ట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నీ వద్ద కొనుగోలు చేసిన దుస్తులు బాగాలేవు. చిరిగిపోయినవి అమ్మావు. మా డబ్బులు ఇవ్వాలని ద్విచక్రవాహనంపై తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్న వ్యక్తిపై నలుగురు దాడిచేశారు. అతడిని బెదిరించి దుస్తులు, ద్విచక్రవాహనం లాక్కొని పారిపోయిన ఘటన పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. యూపీ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన ఎండీ ఖాసిఫ్‌ ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నగరానికి వచ్చాడు. మీరాలంమండిలో ఉంటూ ద్విచక్రవాహనంపై పలు ప్రాంతాల్లో తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్నాడు. ఆదివారం దుస్తులు విక్రయించడానికి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై అమీర్‌పేట వైపు బయలుదేరాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు ఆగంతుకులు ఖాసిఫ్‌ వాహనానికి తమ వాహనాలు అడ్డు పెట్టారు. పది రోజుల క్రితం నీ వద్ద దుస్తులు కొనుగోలు చేశాము.. అవి బాగాలేవు.. మా డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయగా ఖాసిఫ్‌ నిరాకరించాడు. కోపోద్రిక్తులైన వారు అతడి హోండా యాక్టివా వాహనాన్ని, రూ. 5 వేల విలువగల వస్త్రాలు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-08T05:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising