రెచ్చిపోతున్న దొంగలు
ABN, First Publish Date - 2022-08-04T06:02:39+05:30
బంజారాహిల్స్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు.
రెండు రోజుల్లో నాలుగు ఘటనలు
బంజారాహిల్స్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్‌కాలనీకి చెందిన అలక నవీన్ స్థానిక పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చినట్టు నటిస్తూ నవీన్ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాళం పగులకొట్టి
యూసు్‌ఫగూడ ప్రగతినగర్‌కు చెందిన ప్రసన్న గణేష్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రగతి ఎన్‌క్లేవ్‌లో కార్యాలయం ఉంది. ఈ నెల 1న కార్యాలయానికి తాళం వేసి వెళ్లాడు. మరుసటి రోజు వెళ్లి చూడగా తాళం పగులకొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా.. విలువైన సోనీ కెమెరా, లెన్స్, సామ్‌సంగ్ సెల్‌ఫోన్ కనిపించలేదు. కార్యాలయం పక్కనే ఉన్న జీవీ శర్మ ఇంటి తాళాన్ని కూడా దుండగులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఇంట్లో..
యూసు్‌ఫగూడ శ్రీకృష్ణనగర్‌లో నివసిస్తున్న మహ్మద్ అహ్మద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఈ నెల 2వ తేదీ ఉదయం నమాజ్ చేసుకునేందుకు మసీదుకు వెళ్లాడు. ఇంటి తలుపులకు తాళం వేయలేదు. తిరిగి ఇంటికి వెళ్లేసరికి కప్‌బోర్డు తెరిచి ఉంది. పరిశీలించగా.. అందులో భద్రపరిచిన రెండు బంగారు గాజులు, బంగారు చెవి దుద్దులు, సెల్‌ఫోన్ కనిపించలేదు.
ద్విచక్ర వాహనం మాయం
జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ వాజిద్ మెకానిక్, యూసు్‌ఫగూడ సవేరా ఫంక్షన్‌హాల్ వద్ద ఉన్న హ్యుందాయ్ కారు సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. 2వ తేదీన ద్విచక్రవాహనంపై సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. వాహనం బయటపెట్టాడు. ఇంటికి వెళ్లేందుకు బయటకు రాగా వాహనం కనిపించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-08-04T06:02:39+05:30 IST