ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: బజాజ్ అలియన్స్‌లో జరిగిన చోరీని చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-10-06T20:53:44+05:30

కుషాయిగూడ పీఎస్ పరిధిలో సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి బజాజ్ అలియన్స్‌లో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): కుషాయిగూడ పీఎస్ పరిధిలో సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి బజాజ్ అలియన్స్‌లో చోరీ జరిగింది. రూ. 70 లక్షలు విలువైన 432 సెల్ ఫోన్‌ల దొంగతనం జరిగింది. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  సీసీఎస్ (CCS), ఎస్‌వోటీ (SOT), క్లూస్ టీమ్ (Clues Team) సహాయంతో కేసును ఛేదించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ (Mahesh Bhagwat) మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 500 సీసీ ఫుటేజ్‌లు పరిశీలించామని, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని విచారణ చేశామని చెప్పారు. బీహార్, జార్ఖండ్ గ్యాంగ్ ఇక్కడ రెక్కీ చేసి చోరీ చేసినట్లు తెలిపారు. ఇలా దొంగతనం చేసిన మొబైల్స్ నేపాల్, బాంగ్లాదేశ్‌లో అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో సత్తార్ షేక్, ఆసీదుల్ షేక్‌లను గుర్తించి 7 రోజులు తరువాత అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

 

ఈ కేసులో ఆరుగురు కలిసి దొంగతనం చేసినట్లు గుర్తించామని మహేష్ భగవత్ తెలిపారు. అందులో ఇద్దరు అరెస్ట్ అయ్యాక మిగిలిన నలుగురు పరారయ్యారన్నారు. జార్ఖండ్ నుంచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చామన్నారు. ఈ ముఠాకు అలం గ్యాంగ్ అనే పేరు ఉందని, దేశంలో చాలా రాష్ట్రల్లో దోపిడీలు చేసినట్లు గుర్తించామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్ యూనియన్ బ్యాంక్‌లో రూ. 2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారన్నారు. వారిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులపై కాల్పులు జరిపారని, తిరిగి పోలీసులు జరిపిన కాల్పుల్లో అలం అనే వ్యక్తి గాయపడినట్లు చెప్పారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని 7 రోజులు పాటు విచారణ చేసి, ఛేదించామని మహేష్ భగవత్ తెలిపారు.

Updated Date - 2022-10-06T20:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising