ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-20T19:58:51+05:30

తెలుగు రాష్ట్రాల్లో కరోనా దడ పుట్టిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా దడ పుట్టిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇంటికొకరు చొప్పున కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం కాకి లెక్కలు చెబుతూ నిజాలను దాచేస్తున్నారు. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నా.. కేసుల సంఖ్యలో మాత్రం వాటిని కనిపించకుండా దాచేస్తున్నారు. ఏపీలో బుధవారం ఒక్క రోజే దాదాపు 41వేల పరీక్షలు నిర్వహిస్తే 10 వేల కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలో లక్షా 11వేలు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 3,557 పాజిటీవ్ కేసులు మాత్రమే నమోదైనట్లు బులిటెన్ విడుదల చేశారు. పరీక్షలకు, ప్రకటించిన ఫలితాలకు ఎక్కడా పొంతన లేదు. కరోనా కంటే డేంజర్‌గా మరోసారి బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. అవసరం లేకున్నా రోగులు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీంతో వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. వాట్సాప్ వైద్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.

Updated Date - 2022-01-20T19:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising