ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VH: ఖర్గే తీసుకున్న చొరవ అభినందనీయం..

ABN, First Publish Date - 2022-12-15T15:00:26+05:30

చైనా (China) భూ అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantharao) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చైనా (China) భూ ఆక్రమణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantharao) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది మన దేశ భవిష్యత్.. అందరూ ఆలోచించాలి.. చైనాకు అడ్డుకట్ట వేయకపోతే దేశానికి ఎంతో నష్టం’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తాలని మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge) అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. ఖర్గే తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తేయ్యాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ జనగణన జరపాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబంపై సోషల్ మీడియాలో వార్తలు పెట్టారని తమ వార్ రూమ్‌ను పోలీసులు సీజ్ చేశారని వీహెచ్ మండిపడ్డారు. మరి కాంగ్రెస్ నాయకులపై కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పీసీసీ కమిటీల్లో చాలా మందికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. కమిటీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన జరగాలనే దామోదర రాజనర్సింహ చేసిన డిమాండ్ సమంజసమేనన్నారు. పార్టీలో అందరం కలిసి పనిచేయాలని సూచించారు. ఏదైనా ఉంటే పీసీసీ చీఫ్ మాట్లాడాలని.. లేదంటే హైకమాండ్ మాట్లాడాలన్నారు. ఈ విషయాలను ఖర్గే దృష్టికి తీసుకువెళతానన్నారు. దేశంలో చాలా మంది జాతీయ పార్టీలు పెట్టారని, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే ముఖ్యమన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలని హనుమంతరావు అన్నారు.

Updated Date - 2022-12-15T15:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising