ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..

ABN, First Publish Date - 2022-09-23T21:35:15+05:30

అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజారుద్దీన్‌ (Azharuddin)పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (HRC)లో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మైన్ రాచాల యుగంధర్ గౌడ్ (Yugandhar Goud) ఫిర్యాదు చేశారు. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని పిర్యాదు చేశారు. దీనిపై అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. పదవి నుంచి తొలగించాలని కోరారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉప్పల్‌లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్‌కు ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు. క్రీడాభిమానుల నుంచి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని.. టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని హెచ్‌సీఏ, ఇతర రాజాకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-23T21:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising